Friday, 22 May 2026
  • Home  
  • ఆత్మకూరు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.7.49 కోట్ల ఆర్థిక సాయం : మంత్రి ఆనం
- News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.7.49 కోట్ల ఆర్థిక సాయం : మంత్రి ఆనం

ఆత్మకూరులో 49 మంది లబ్ధిదారులకు రూ.44.89 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ఆత్మకూరు, మే 22 (హరికిరణ్ , పున్నమి ప్రతినిధి): పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య భద్రతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.శుక్రవారం ఆత్మకూరు పట్టణంలో 49 మంది లబ్ధిదారులకు రూ.44.89 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి ఆనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదారంగా ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారని తెలిపారు.ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంలోనే 809 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.7,49,67,338 ఆర్థిక సాయం అందించామని మంత్రి వెల్లడించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద కుటుంబాలకు వైద్య సహాయం అందించడం వల్ల అనేక కుటుంబాలు ఆర్థిక భారంనుంచి బయటపడుతున్నాయని పేర్కొన్నారు.పేదలకు ప్రతి విషయంలోనూ మంచి చేయాలనే ఆలోచనతో తమ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి ఆనం తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. టీడీపీ సభ్యత్వంతో రూ.5 లక్షల ప్రమాద బీమా రక్షణ ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ గంగాప్రసాద్ , తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళ్లూరి గిరి నాయుడు ,ఆనం లీలా కైవల్య రెడ్డి, పట్టనాధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఆత్మకూరులో 49 మంది లబ్ధిదారులకు రూ.44.89 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ఆత్మకూరు, మే 22 (హరికిరణ్ , పున్నమి ప్రతినిధి):

పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య భద్రతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.శుక్రవారం ఆత్మకూరు పట్టణంలో 49 మంది లబ్ధిదారులకు రూ.44.89 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి ఆనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదారంగా ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారని తెలిపారు.ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంలోనే 809 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.7,49,67,338 ఆర్థిక సాయం అందించామని మంత్రి వెల్లడించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద కుటుంబాలకు వైద్య సహాయం అందించడం వల్ల అనేక కుటుంబాలు ఆర్థిక భారంనుంచి బయటపడుతున్నాయని పేర్కొన్నారు.పేదలకు ప్రతి విషయంలోనూ మంచి చేయాలనే ఆలోచనతో తమ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి ఆనం తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. టీడీపీ సభ్యత్వంతో రూ.5 లక్షల ప్రమాద బీమా రక్షణ ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ గంగాప్రసాద్ , తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళ్లూరి గిరి నాయుడు ,ఆనం లీలా కైవల్య రెడ్డి, పట్టనాధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.