ఆడాల వెంకటయ్య కుటుంబానికి ఏవిజి ఫౌండేషన్ ఆర్థిక సహాయం
పున్నమి న్యూస్
08 మే 2026
తెలంగాణ ఇంచార్జి
ఆడాల వెంకటయ్య, అనసూయ దంపతుల మూడవ కుమార్తె వివాహం సందర్భంగా ఏవిజి ఫౌండేషన్ తరపున 10016 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ సహాయాన్ని అందించడం పట్ల గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, సమాజంలో అవసరమైన వారికి సహాయం చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. వివాహం సాఫల్యంగా జరగాలని, కొత్త దంపతులకు సుఖసంతోషాలతో నిండిన జీవితం కలగాలని ఆకాంక్షించారు.
అలాగే, వెంకటయ్య కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రముఖులు, గ్రామస్తులు పాల్గొన్నారు.





