Friday, 11 July 2025
  • Home  
  • ఆచార్య దార్లకు ఏ.పి. ప్రభుత్వ ఉగాది పురస్కారం*
- Featured - ఆంధ్రప్రదేశ్

ఆచార్య దార్లకు ఏ.పి. ప్రభుత్వ ఉగాది పురస్కారం*

  * హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీవిశ్వావ‌సు నామ సంవ‌త్స‌ర ఉగాది సంద‌ర్భంగా ఉగాది పురస్కారంతో సత్కరించింది. ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కోనసీమ జిల్లాకు చెందిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. కవిగా ఆయన ‘దళిత తాత్వికుడు’, ‘నెమలి కన్నులు’ కవితా సంపుటాలను, ‘వీచిక’ సాహిత్య విమర్శ వ్యాసాలు, ‘బహుజన సాహిత్య దృక్పథం’, ‘పునర్మూల్యాంకనం’ ‘సాహితీసులోచనం’ ఆత్మకథ ‘నెమలికన్నులు’ తదితర గ్రంథాలు రచించారు. గతంలో సెంట్రల్ యూనివర్సిటీ వారు పరిశోధన బోధన రంగాలలో విశేషమైన కృషి చేసినందుకు గాను ఇచ్చే ఛాన్సలర్ అవార్డుతో పాటు లక్షరూపాయల ప్రత్యేక పరిశోధన నిధిని అందుకున్నారు. వీటితోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఇచ్చే కీర్తి పురస్కారం, జాషువా జాతీయ పురస్కారం తదితరు పరిష్కారాలు అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక విశ్వవిద్యాలయాలలో బోట్ ఆఫ్ స్టడీస్ మెంబెర్ గా ఉన్నారు. ఈ అవార్టీ పుష్కారం రావడం పట్ల హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు అధ్యాపకులు, విద్యార్థులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

 

*

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీవిశ్వావ‌సు నామ సంవ‌త్స‌ర ఉగాది సంద‌ర్భంగా ఉగాది పురస్కారంతో సత్కరించింది. ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కోనసీమ జిల్లాకు చెందిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. కవిగా ఆయన ‘దళిత తాత్వికుడు’, ‘నెమలి కన్నులు’ కవితా సంపుటాలను, ‘వీచిక’ సాహిత్య విమర్శ వ్యాసాలు, ‘బహుజన సాహిత్య దృక్పథం’, ‘పునర్మూల్యాంకనం’ ‘సాహితీసులోచనం’ ఆత్మకథ ‘నెమలికన్నులు’ తదితర గ్రంథాలు రచించారు. గతంలో సెంట్రల్ యూనివర్సిటీ వారు పరిశోధన బోధన రంగాలలో విశేషమైన కృషి చేసినందుకు గాను ఇచ్చే ఛాన్సలర్ అవార్డుతో పాటు లక్షరూపాయల ప్రత్యేక పరిశోధన నిధిని అందుకున్నారు. వీటితోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఇచ్చే కీర్తి పురస్కారం, జాషువా జాతీయ పురస్కారం తదితరు పరిష్కారాలు అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక విశ్వవిద్యాలయాలలో బోట్ ఆఫ్ స్టడీస్ మెంబెర్ గా ఉన్నారు. ఈ అవార్టీ పుష్కారం రావడం పట్ల హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు అధ్యాపకులు, విద్యార్థులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.