Friday, 31 July 2026
  • Home  
  • ఆగస్టు 2న పోలీస్, మీడియా కుటుంబాలకు ఉచిత మెగా వైద్య శిబిరం-డీఎస్పీ
- తిరుపతి

ఆగస్టు 2న పోలీస్, మీడియా కుటుంబాలకు ఉచిత మెగా వైద్య శిబిరం-డీఎస్పీ

శ్రీ కాళహస్తి, జులై 31, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని బీపీ అగ్రహారంలో గల జడ్పీ బాయ్స్ హైస్కూల్‌ నందు ఆగస్టు రెండవ తేదీ ఆదివారం నాడు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి ప్రకటించారు. డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వన్ టౌన్ సీఐ వెంకటేష్‌తో కలిసి ఆయన ఈ వివరాలను వెల్లడించారు. తిరుపతి డీఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నారాయణ రెడ్డి నేతృత్వంలో ఈ భారీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిబిరంలో పోలీస్ శాఖ సిబ్బంది కుటుంబ సభ్యులతో పాటు మీడియా ప్రతినిధుల కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. శిబిరానికి విచ్చేసే వారికి రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) పరీక్షలతో పాటు గుండె జబ్బుల గుర్తింపునకు అవసరమైన ఈసీజీ పరీక్షలను ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నారు. పోలీస్, మీడియా కుటుంబాల వారు తమ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎస్పీ పిలుపునిచ్చారు. ఈ శిబిరం విజయవంతం కావడానికి ముఖ్యంగా సహాయ సహకారాలు అందిస్తున్న వీఎన్ఆర్ గిఫ్ట్ ప్లాజా అధినేత ఓరుగంటి నాగేశ్వరరావు, డీఎన్ఆర్ హాస్పిటల్ యాజమాన్యానికి పోలీస్ డిపార్ట్‌మెంట్ తరఫున డీఎస్పీ నరసింహమూర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.