Wednesday, 16 September 2026
  • Home  
  • ఆకురోపల్లెలో వైభవంగా వినాయక చవితి వేడుకలు
- కడప

ఆకురోపల్లెలో వైభవంగా వినాయక చవితి వేడుకలు

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్ధవటం మండలంలోని ఆకురోపల్లె ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద 14వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ విఘ్నేశ్వరుడు ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రతి ఒక్కరూ పండుగను ఆనందంగా జరుపుకునేలా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు.వినాయక విగ్రహాల నిమజ్జనం సమయంలో పిల్లలు నీటిలోకి వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరుణ దేవుని కరుణతో సకాలంలో వర్షాలు కురిసి రైతుల పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో విజయభాస్కర్, సాయికిరణ్, గంపాల చంద్రశేఖర్, ప్రశాంత్‌కుమార్, సంతోష్, వెంకటయ్య, భరణికుమార్, వంశీ, బాలాజీ, శ్యాంప్రసాద్‌తో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.