Sunday, 2 August 2026
  • Home  
  • అల్లూరి సీతారామరాజు విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు
- విజయనగరం 

అల్లూరి సీతారామరాజు విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు

అల్లూరి సీతారామరాజు విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు* విజయనగరం జిల్లా బ్యూరో /రమణ, ఆగస్టు 1. ( పున్నమి ప్రతినిధి ) • భోగాపురం ఎయిర్ పోర్టుకు భూములిచ్చిన రైతులు ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. • 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తామని నరేంద్రమోదీ నాయకత్వంలో నేను, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాం.. దాన్ని నిలబెట్టుకున్నాం. • భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకు మణిహారం. • ఎర్రబస్సు రాదన్నారు.. కానీ ఎయిర్ బస్ వచ్చింది. • అవహేళన చేసిన వారు.. అడ్రస్ లేకుండా పోయారు. • అభివృద్ధికి అడ్డుపడ్డారు.. ఆకాంక్షలను అడ్డుకున్నారు. • భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకే గర్వకారణం. • అల్లూరి పేరు తలుచుకుంటే గుండె ఉప్పొంగుతుంది.. ఆయన పేరును భోగాపురం ఎయిర్ పోర్టుకు పెట్టాం. • ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు. • ఉత్తరాంధ్ర వాసి జీఎమ్మార్ ఈ ఎయిర్ పోర్టు నిర్మించారు. • ఎయిర్ పోర్టు నిర్మాణానికి తొలి అడుగులు వేయించిన అశోక్ గడపతి రాజు, ప్రస్తుత విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడుది ఉత్తరాంధ్ర. • ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు సెంటిమెంట్ నిలబెట్టింది ప్రధాని నరేంద్ర మోదీ. • విశాఖ రైల్వే జోన్, పోలవరం, రాజధాని అమరావతికి నిధులు ఇచ్చింది ప్రధాని నరేంద్ర మోదీనే. • 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాం.. ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తాం. • 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులను పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే ప్రారంభిస్తాం. • ఓ పక్క సముద్రం… మరొపక్క కొండల మధ్య విమాన ప్రయాణం కొత్త అనుభూతినిస్తుంది. • అల్లూరి ఎయిర్ పోర్టులో అడుగడుగునా తెలుగు సంప్రదాయం ఉట్టిపడుతోంది. • విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్ కారిడార్ నిర్మిస్తున్నాం. • శంషాబాద్ ఎయిర్ పోర్టుతో తెలంగాణ దశ దిశ మారింది… భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. • భోగాపురం ఎయిర్ పోర్టుకు నాడు కొబ్బరికాయ కొట్టాం.. ఇప్పుడు గుమ్మడి కాయ కట్టాం. • 2 ఏళ్లలో ప్రధాని మోదీ సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులు.. రూ.6.13 లక్షల పెట్టుబడులు… ఇవి పూర్తి అయితే 5.57 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. • వచ్చే 3 ఏళ్లల్లో రూ.2784 కోట్లతో 8 ప్రధాన సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. • 65 ఏళ్లుగా పెండింగులో ఉన్న నేరడి బ్యారేజీకి క్లియరెన్స్ వచ్చింది. • ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని అనకాపల్లికి తెస్తాం. • వంశధార-గోదావరి అనుసంధానం చేస్తాం. • ఉత్తరాంధ్ర టూరిజం, ఫార్మా, జాతీయ రహదారులు, రేర్ ఎర్త్ మినరల్స్.. పుణ్యక్షేత్రాలు వంటివి ఉన్నాయి. • ఉత్తరాంధ్రకే వలసలు వచ్చే రోజులు త్వరలోనే వస్తాయి. • మేం కల్పించే అవకాశాలను అందిపుచ్చుకోవాలి.

అల్లూరి సీతారామరాజు విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు*

విజయనగరం జిల్లా బ్యూరో /రమణ, ఆగస్టు 1. ( పున్నమి ప్రతినిధి )

• భోగాపురం ఎయిర్ పోర్టుకు భూములిచ్చిన రైతులు ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.
• 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తామని నరేంద్రమోదీ నాయకత్వంలో నేను, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాం.. దాన్ని నిలబెట్టుకున్నాం.
• భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకు మణిహారం.
• ఎర్రబస్సు రాదన్నారు.. కానీ ఎయిర్ బస్ వచ్చింది.
• అవహేళన చేసిన వారు.. అడ్రస్ లేకుండా పోయారు.
• అభివృద్ధికి అడ్డుపడ్డారు.. ఆకాంక్షలను అడ్డుకున్నారు.
• భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకే గర్వకారణం.
• అల్లూరి పేరు తలుచుకుంటే గుండె ఉప్పొంగుతుంది.. ఆయన పేరును భోగాపురం ఎయిర్ పోర్టుకు పెట్టాం.
• ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు.
• ఉత్తరాంధ్ర వాసి జీఎమ్మార్ ఈ ఎయిర్ పోర్టు నిర్మించారు.
• ఎయిర్ పోర్టు నిర్మాణానికి తొలి అడుగులు వేయించిన అశోక్ గడపతి రాజు, ప్రస్తుత విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడుది ఉత్తరాంధ్ర.
• ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు సెంటిమెంట్ నిలబెట్టింది ప్రధాని నరేంద్ర మోదీ.
• విశాఖ రైల్వే జోన్, పోలవరం, రాజధాని అమరావతికి నిధులు ఇచ్చింది ప్రధాని నరేంద్ర మోదీనే.
• 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాం.. ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తాం.
• 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులను పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే ప్రారంభిస్తాం.
• ఓ పక్క సముద్రం… మరొపక్క కొండల మధ్య విమాన ప్రయాణం కొత్త అనుభూతినిస్తుంది.
• అల్లూరి ఎయిర్ పోర్టులో అడుగడుగునా తెలుగు సంప్రదాయం ఉట్టిపడుతోంది.
• విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్ కారిడార్ నిర్మిస్తున్నాం.
• శంషాబాద్ ఎయిర్ పోర్టుతో తెలంగాణ దశ దిశ మారింది… భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది.
• భోగాపురం ఎయిర్ పోర్టుకు నాడు కొబ్బరికాయ కొట్టాం.. ఇప్పుడు గుమ్మడి కాయ కట్టాం.
• 2 ఏళ్లలో ప్రధాని మోదీ సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులు.. రూ.6.13 లక్షల పెట్టుబడులు… ఇవి పూర్తి అయితే 5.57 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి.
• వచ్చే 3 ఏళ్లల్లో రూ.2784 కోట్లతో 8 ప్రధాన సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.
• 65 ఏళ్లుగా పెండింగులో ఉన్న నేరడి బ్యారేజీకి క్లియరెన్స్ వచ్చింది.
• ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని అనకాపల్లికి తెస్తాం.
• వంశధార-గోదావరి అనుసంధానం చేస్తాం.
• ఉత్తరాంధ్ర టూరిజం, ఫార్మా, జాతీయ రహదారులు, రేర్ ఎర్త్ మినరల్స్.. పుణ్యక్షేత్రాలు వంటివి ఉన్నాయి.
• ఉత్తరాంధ్రకే వలసలు వచ్చే రోజులు త్వరలోనే వస్తాయి.
• మేం కల్పించే అవకాశాలను అందిపుచ్చుకోవాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.