అర్థనగ్నం తో 10వ రోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించిన వీఆర్ఏలు..
మర్రిపాడు ఫిబ్రవరి 17 (పున్నమి విలేకరి )
మర్రిపాడు మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట తమ సమస్యలను తీర్చాలని గత 10 రోజుల నుండి దీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో గురువారం వారి యొక్క దీక్షని వినూత్నంగా నిర్వహించడం జరిగింది. గురువారం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట అర్ధనగ్నం రిలే నిరాహార దీక్షలో మర్రిపాడు మండల గ్రామ రెవిన్యూ సహాయకులు పాల్గొన్నారు. మండల రెవెన్యూ వీఆర్ఏ లకు కనీస వేతనం 21000 గా ఇవ్వాలని, నామిని లను వీఆర్ఏలు గా నియమించాలని, దశలవారీగా వీఆర్ఏల ఆందోళనలను జయప్రదం చేయాలని గ్రామ రెవెన్యూ సహాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు మూలి వెంగయ్య మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకులకు కనీస వేతనం 21000ఇవ్వాలని, డిఎ తో కలిపి వేతనం చెల్లించాలని నామినీలను విఆర్ఏలు గా నియమించాలని , అర్హులకు ప్రమోషన్ ఇవ్వాలని, 65 సంవత్సరాలు దాటిన చనిపోయిన వీఆర్ఏ కుటుంబంలో కంపాస్నెట్ గ్రౌండ్ కింద కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రధాన డిమాండ్స్ తో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో లో మండల వీఆర్ఏల అధ్యక్షులు ఓబులేసు ఉపాధ్యక్షులు నానాజీ తదితరులు పాల్గొన్నారు.