అరకులోయ మండలం, గన్నెల ఏపీటీడబ్ల్యూఆర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఫిర్యాదుల కమిటీ (ఎల్సీసీ) చైర్పర్సన్ డాక్టర్ కంబిడి కె. కృష్ణకుమారి బాల్యవివాహాలు, టీనేజ్ గర్భధారణ వల్ల కలిగే అనర్థాలు, విద్య ప్రాధాన్యతపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. విద్యతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, హెచ్ఆర్ఏసీ అరకులోయ వైస్ ప్రెసిడెంట్ కె. సిమాచలం పాల్గొన్నారు.



