ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల ఆన్లైన్ దరఖాస్తు గడువును పొడిగించాలని ఆదివాసీ గిరిజన సంఘం మండల నాయకుడు కుమిడి రమేష్ కోరారు. అరకులోయ మండలం, మాదల పంచాయతీలో సుమారు 100 మంది అర్హులు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్, ఓటర్ కార్డు తదితర పత్రాల సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్, మొబైల్ సిగ్నల్ సమస్యలతో ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించలేకపోతున్నారని పేర్కొన్నారు. వరుస సెలవుల నేపథ్యంలో గడువు పొడిగించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అరకు: పెన్షన్ దరఖాస్తు గడువు పొడిగించాలి