పత్రికా ప్రకటన
*అమరావతి పెరేడ్ గ్రౌండ్స్‌లో జూన్ 21న జరిగే రాష్ట్ర స్థాయి యోగ కార్యక్రమానికి ఏర్పాట్లు షురూ*
గుంటూరు, జూన్ 11 :
అమరావతి పెరేడ్ గ్రౌండ్స్‌లో జూన్ 21న నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి యోగ కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సి యం. సాయికాంత్ వర్మ జిల్లా ఎస్ పి వకుల్ జిందాల్ తో కలసి గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అమరావతి పెరేడ్ గ్రౌండ్స్‌కు దాదాపు 13 వేల మంది ప్రజలు, యోగ సాధకులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలన్నారు. ముందస్తు ఏర్పాట్లకు ప్రణాళిక రచించుకొని అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధాన వేదిక ముందు భాగంలో 25 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయాలని ఒక్కో కంపార్ట్మెంట్లో 50 మంది యోగ సాధకులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కంపార్ట్మెంటుకు ఎంపీడీవో స్థాయి అధికారి ఇన్చార్జిగా, వైద్య, పారిశుద్ధ్య, పంచాయతీ శాఖల అధికారులు, సిబ్బందితో ప్రత్యేక టీంను నియమించాలన్నారు. అదేవిధంగా దాదాపు 300 బస్సులు వచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేయాలని, పార్కింగ్ ప్రదేశాలను సులువుగా గుర్తించే విధంగా సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. పెరేడ్ గ్రౌండ్ పరిసరాలు అత్యంత పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, గుంటూరు మున్సిపల్ కమీషనర్ కె. మయూర్ అశోక్, ఆర్డిఓ శ్రీనివాసరావు, పోలీసు, వైద్య, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
( జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయం, గుంటూరు వారిచే జారీ చేయడమైనది )


