Wednesday, 9 September 2026
  • Home  
  • అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్: లింగాల కమల్ రాజు
- ఖమ్మం

అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్: లింగాల కమల్ రాజు

మధిర/ ఖమ్మం ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్ రాజు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లింగాల కమల్ రాజు మాట్లాడుతూ 300 రోజులైనా, 700 రోజులైనా, చివరకు వెయ్యి రోజులు పూర్తయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వెయ్యి రోజుల పాలన పేరుతో సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని లింగాల కమల్ రాజు హెచ్చరించారు.

మధిర/ ఖమ్మం

ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్ రాజు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లింగాల కమల్ రాజు మాట్లాడుతూ 300 రోజులైనా, 700 రోజులైనా, చివరకు వెయ్యి రోజులు పూర్తయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వెయ్యి రోజుల పాలన పేరుతో సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని లింగాల కమల్ రాజు హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.