జనగామ మండలంలో ఉన్న అన్ని గ్రామాల చెరువులకు తొందర్లో దేవాదుల నీరు విడుదలకు చర్యలు
—————————————————————–
జనగామ జిల్లా జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే *కొమ్మూరి ప్రతాప్ రెడ్డి* గారి సూచన మేరకే ఈరోజు జనగామ మండలం లో ఉన్న ప్రతి గ్రామాలలో సాగు నీరు కోసం చెరువులకు నీరు విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను మండల కాంగ్రెస్ నేతలతో కలిసి కోరిన జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *బనుక శివరాజ్ యాదవ్*అన్నారు.
ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ DE మనమదరావు, గారికి నీటి విడుదల గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం DE మనమదరావు మరియు AE రాజు గార్లతో కాంగ్రెస్ నాయకులు కలిసి ఆయా గ్రామాల కెనాల్ కాల్వలను సందర్శించి ప్రతి గ్రామం కి నీరు విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు పంటలు ఎండిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నాయకులు అధికారులను కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండ శ్రీధర్ రెడ్డి,జిల్లా నాయకులు సర్వాల నర్సింగరావు, సేవాదళ్ రాష్ట్ర నాయకులు సుంకరి శ్రీనివాస్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి, AMC డైరెక్టర్ లు బానోతు బన్సీ నాయక్,శీలం కొండల్ రెడ్డి,మండల ఉపాధ్యక్షులు సాదం మధుసూదన్, సంకటి యాదగిరి,సర్పంచులు జానేపల్లి జనార్ధన్ రెడ్డి,శ్యామ్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాల్నే సుధాకర్,వంశీ,సంపత్,బిక్షపతి, కృష్ణ రెడ్డి, చమకూర శ్రీహరి, ఏళ్ల సంతోష్ రెడ్డి,వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోదాల వంశీధర్ రెడ్డి, బక్క ప్రవర్ధన్, నర్రా సిద్దారెడ్డి, గందమల కమలాకర్, సుంకరి ఉపేందర్ రెడ్డి,బి సత్యనారాయణ, బొంకురి రాజు,కనకరాజు, వేణు,శ్రీను,రాజేష్,హరీష్ మరియు వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.


