అన్ని దానాలలో కెల్లా నేత్రదానం గొప్పది.
*ముప్పవరపు శ్రీనివాసరావు* పదవీ విరమణ సందర్భంగా ఉచిత నేత్ర వైద్య శిబిరం.
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 31 కోట మండలం,*
అన్ని దానాలలో కెల్లా నేత్రదానం గొప్పదని ఎం.వి. రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు.
సోమవారం కోట పంచాయతీ పరిధిలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో అంగనవాడి కేంద్రం సమీపంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరాన్ని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అల్లం బాబు, విశ్రాంత ఉపాధ్యాయులు ఆవుల సుబ్బయ్య ప్రారంభించారు.
ప్రకాశం జిల్లా చీరాల ఏపిఎస్ఆర్టిసి డిపోలో కండక్టర్ గా పని చేస్తున్న సోదరుడు ముప్పవరపు శ్రీనివాసరావు పదవీ విరమణ సందర్భంగా ఈ నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని లీలామోహన్ కృష్ణ తెలిపారు.
గిరిజన వాడల్లో ఎం వి రావు ఫౌండేషన్ ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి అక్కడ గిరిజన ప్రాంత వాసులకు దృష్టిలోపాన్ని అరికట్టే నిమిత్తం గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా తమ ఫౌండేషన్ నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలలో నివారణ పై ప్రత్యేక అవగాహన మరియు శిబిరాలు నిర్వహిస్తూ ఆ ప్రాంత వాసుల దృష్టిలోపాన్ని అరికట్టేందుకు కృషి చేస్తుందని ఆయన అన్నారు.
కోట పట్టణానికి చెందిన రమేష్ ఐ కేర్ నేత్ర వైద్య నిపుణుడు వoజీవాక. రమేష్ నేతృత్వంలో శిబిరానికి హాజరైన వారందరినీ కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి వారిలో దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించారు.
కంటి అద్దాలు అవసరమైన వారికి అతి తక్కువ ధరకు కంటి అద్దాలు, అదేవిధంగా కంటిలో శుక్లాలు ఉన్నవారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు తిరుపతి వాసన్ ఐ కేర్ నందు నిర్వహించనున్నామని ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పువరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి అల్లం బాబు, ఆవుల సుబ్బయ్య పాఠశాల ఉపాధ్యాయిని అంగనవాడి సిబ్బంది శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీవాసులు పాల్గొన్నారు.



