Saturday, 12 September 2026
  • Home  
  • అనంతసాగరంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అనంతసాగరంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

అనంతసాగరం, ఆగస్టు 15 (ప్రభాతవార్త): మండల కేంద్రమైన అనంతసాగరంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షురాలు పెయ్యల సంపూర్ణమ్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీటీసీ సభ్యులు రాపూరు వెంకట సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ పెయ్యల సంపూర్ణమ్మ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవాలని, వారి త్యాగాల స్ఫూర్తితో దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జడ్పీటీసీ సభ్యులు రాపూరు వెంకట సుబ్బారెడ్డి మండల ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, సంక్షేమ సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఎంపీడీవో ఐజాక్ ప్రవీణ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించిన ఎనిమిది దశాబ్దాల కాలంలో దేశం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో మహిళలు పురుషులతో సమానంగా అవకాశాలను అందిపుచ్చుకుని కుటుంబ, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తితో దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, మండల పరిషత్ సిబ్బంది, వెలుగు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అనంతసాగరం, ఆగస్టు 15 (ప్రభాతవార్త): మండల కేంద్రమైన అనంతసాగరంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షురాలు పెయ్యల సంపూర్ణమ్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీటీసీ సభ్యులు రాపూరు వెంకట సుబ్బారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీపీ పెయ్యల సంపూర్ణమ్మ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవాలని, వారి త్యాగాల స్ఫూర్తితో దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జడ్పీటీసీ సభ్యులు రాపూరు వెంకట సుబ్బారెడ్డి మండల ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, సంక్షేమ సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఎంపీడీవో ఐజాక్ ప్రవీణ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించిన ఎనిమిది దశాబ్దాల కాలంలో దేశం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో మహిళలు పురుషులతో సమానంగా అవకాశాలను అందిపుచ్చుకుని కుటుంబ, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తితో దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, మండల పరిషత్ సిబ్బంది, వెలుగు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.