Thursday, 30 July 2026
  • Home  
  • అచలగురు మందిరంలో వైభవంగా 53వ వార్షిక ఆరాధనోత్సవాలు
- తిరుపతి

అచలగురు మందిరంలో వైభవంగా 53వ వార్షిక ఆరాధనోత్సవాలు

శ్రీ కాళహస్తి, జులై 29, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక సంతమైదానం వద్ద ఉన్న శ్రీ శివరామదీక్షిత అచలగురు మందిరంలో గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని 53వ వార్షిక ఆరాధనోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బృహద్యాజ్ఞవల్క్య సిద్ధాంతం, శ్రీ శివరామదీక్షిత అచలగురు పీఠ సంప్రదాయం మేరకు పీఠాధిపతి పరిపూర్ణాత్మపాచార్యులు గరిక వెంకటసుబ్బయ్య స్వామివారి దివ్య సాన్నిధ్యంలో ఈ ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభాయమానంగా సాగాయి. ఉదయం 5 గంటలకు మేలుకొలుపుతో ప్రారంభమైన కార్యక్రమాల్లో ప్రభాత సేవ, గురుపాదుకల లఘుపూజ, గురుగీతా పారాయణం, నగర సంకీర్తనలను భక్తులు భక్తిప్రపత్తులతో నిర్వహించారు. అనంతరం అచల జెండా ప్రతిష్ఠాపన, శ్రీ ఆత్మప్రబోధానంద ఆశ్రమ వంశీయులచే నిజగురు పూజా విధానాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. మధ్యాహ్నం నిర్వహించిన వేదాంతాతీత మహాసభలో ప్రముఖులు చేసిన ఆధ్యాత్మిక ప్రసంగాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాయంత్రం అగ్రపూజ, మహిళా సభ, తత్త్వవిచారణ, భజన కార్యక్రమాలు భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపాయి. అనంతరం తెల్లవారుజామున గురువులకు పాదపూజ, మహామంగళహారతి, అచల జెండా అవరోహణతో ఈ వార్షిక ఉత్సవాలు మంగళప్రదంగా ముగిశాయి. ఈ ప్రత్యేక ఆరాధనోత్సవాలకు శ్రీకాళహస్తి పట్టణ ప్రముఖులు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన గురువులు, అచలమార్గ ప్రవర్తకులు, వేలాదిమంది గురుభక్తులు విశేషంగా హాజరయ్యారు. గురుపూజల్లో పాల్గొన్న భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి సద్గురువుల ఆశీర్వాదాలు పొందగా, విచ్చేసిన భక్తులందరికీ నిర్వాహకులు అన్నదాన ప్రసాదాన్ని అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.