Sunday, 26 July 2026
  • Home  
  • అగ్నిగుండ ప్రవేశ భక్తులకు కంకణధారణలు అందదజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
- తిరుపతి

అగ్నిగుండ ప్రవేశ భక్తులకు కంకణధారణలు అందదజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీ కాళహస్తి, జులై 26, (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ ద్రౌపతీ సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్ట ఘట్టమైన అగ్నిగుండ ప్రవేశ మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా అగ్నిగుండ ప్రవేశం చేయనున్న భక్తులకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శాస్త్రోక్తంగా కంకణధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహోత్సవాలకు భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యసేవలు, కట్టుదిట్టమైన భద్రతతో పాటు అన్ని మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి ప్రముఖులు కొట్టే సాయి ప్రసాద్, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్లు, దేవస్థాన పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో కంకణధారణలో పాల్గొని స్వామి, అమ్మవార్ల అనుగ్రహం కోసం ప్రార్థనలు చేయడంతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో కళకళలాడింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.