Tuesday, 8 September 2026
  • Home  
  • అక్షరాస్యతపై విస్తృత అవగాహన కల్పించాలి – వయోజన విద్యాశాఖ డిడి సోమేశ్వరరావు
- విజయనగరం 

అక్షరాస్యతపై విస్తృత అవగాహన కల్పించాలి – వయోజన విద్యాశాఖ డిడి సోమేశ్వరరావు

*అక్షరాస్యతపై విస్తృత అవగాహన కల్పించాలి* *వయోజన విద్యాశాఖ డిడి సోమేశ్వరరావు* విజయనగరం జిల్లా బ్యూరో రమణ సెప్టెంబర్ 8 పున్నమి ప్రతినిధి విజయనగరం (నెల్లిమర్ల), అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లిమర్ల మండలం వేణుగోపాలపురం డైట్‌ కళాశాలలో మంగళవారం జిల్లా స్థాయి అక్షరాస్యతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఛాత్రోపాధ్యాయులచే మానవహారం, అక్షరాస్యతా ప్రతిజ్ఞ, సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ, వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సోమేశ్వరరావు, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్షరాస్యత ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని సూచించారు. సమాజ అభివృద్ధిలో అక్షరాస్యత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అక్షరాస్యతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా డైట్‌ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాసరచన, వక్తృత్వ, సాంస్కృతిక కార్యక్రమాల విజేతలకు బహుమతి ప్రధానం జరిగింది. ఈ కార్యక్రమంలో డైట్‌ కళాశాల సిబ్బంది, అధ్యాపకులు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

*అక్షరాస్యతపై విస్తృత అవగాహన కల్పించాలి*

*వయోజన విద్యాశాఖ డిడి సోమేశ్వరరావు*

విజయనగరం జిల్లా బ్యూరో రమణ సెప్టెంబర్ 8 పున్నమి ప్రతినిధి

విజయనగరం (నెల్లిమర్ల), అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లిమర్ల మండలం వేణుగోపాలపురం డైట్‌ కళాశాలలో మంగళవారం జిల్లా స్థాయి అక్షరాస్యతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఛాత్రోపాధ్యాయులచే మానవహారం, అక్షరాస్యతా ప్రతిజ్ఞ, సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ, వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సోమేశ్వరరావు, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్షరాస్యత ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని సూచించారు. సమాజ అభివృద్ధిలో అక్షరాస్యత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అక్షరాస్యతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా డైట్‌ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాసరచన, వక్తృత్వ, సాంస్కృతిక కార్యక్రమాల విజేతలకు బహుమతి ప్రధానం జరిగింది. ఈ కార్యక్రమంలో డైట్‌ కళాశాల సిబ్బంది, అధ్యాపకులు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.