Tuesday, 12 May 2026
  • Home  
  • అక్కుర్తిలో అభయ ఆంజనేయస్వామి రథోత్సవం ఘనంగా
- తిరుపతి

అక్కుర్తిలో అభయ ఆంజనేయస్వామి రథోత్సవం ఘనంగా

శ్రీకాళహస్తి, మే 12 (పున్నమి టెంపుల్ న్యూస్): బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా శ్రీకాళహస్తి మండలంలోని అక్కుర్తి గ్రామంలో వెలసిన అభయ ఆంజనేయస్వామి ఆలయ రథోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, వారి ధర్మపత్ని రిషిత రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు జులుగంటి కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న వారు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తుల జయజయధ్వానాల నడుమ ఎమ్మెల్యే దంపతులు రథోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి పార్టీల ప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఉత్సవాన్ని విజయవంతం చేశారు. భక్తులతో కిక్కిరిసిన ఆలయ పరిసరాలు హనుమన్నామ స్మరణతో మారుమోగాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.