భారత రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రలో భాగంగానే మనువాదులు బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిపై కల్పిత పుస్తకాలు రాయించి, హమారా ప్రసాద్ (ఆవాల ప్రసాద్) చేత ఆవిష్కరించేందుకు యత్నిస్తున్నారని ‘దళిత మేధా శక్తి’ వ్యవస్థాపక అధ్యక్షుడు బోట్ల పవన్ ఆరోపించారు. ప్రపంచం కీర్తించే అంబేద్కర్ గొప్పతనాన్ని జీర్ణించుకోలేక మనువాదులు ఈ కుట్రకు తెరతీశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ పుస్తకాన్ని నిషేధించాలని, అసత్య ప్రచారాలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం దళిత మేధా శక్తి ‘బొల్లోనిపల్లి’ గ్రామ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షుడు: బరుపట్ల నరేష్ ప్రధాన కార్యదర్శి: రుద్రారపు రవి
అధికార ప్రతినిధి: బరుపట్ల రాజపోషాలు
కమిటీ సభ్యులు: పెంబర్తి రాజ్ కుమార్, పెంబర్తి రమేష్
ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక సభ్యులు పెంబర్తి శ్రీనివాస్, కొయ్యడ కుమారస్వామి, నాయకులు ఇనుగాల రవి, పెంబర్తి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ పై తప్పుడు ప్రచారాలు మనువాదుల కుట్ర: దళిత మేధా శక్తి
భారత రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రలో భాగంగానే మనువాదులు బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిపై కల్పిత పుస్తకాలు రాయించి, హమారా ప్రసాద్ (ఆవాల ప్రసాద్) చేత ఆవిష్కరించేందుకు యత్నిస్తున్నారని ‘దళిత మేధా శక్తి’ వ్యవస్థాపక అధ్యక్షుడు బోట్ల పవన్ ఆరోపించారు. ప్రపంచం కీర్తించే అంబేద్కర్ గొప్పతనాన్ని జీర్ణించుకోలేక మనువాదులు ఈ కుట్రకు తెరతీశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ పుస్తకాన్ని నిషేధించాలని, అసత్య ప్రచారాలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం దళిత మేధా శక్తి ‘బొల్లోనిపల్లి’ గ్రామ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షుడు: బరుపట్ల నరేష్ ప్రధాన కార్యదర్శి: రుద్రారపు రవి అధికార ప్రతినిధి: బరుపట్ల రాజపోషాలు కమిటీ సభ్యులు: పెంబర్తి రాజ్ కుమార్, పెంబర్తి రమేష్ ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక సభ్యులు పెంబర్తి శ్రీనివాస్, కొయ్యడ కుమారస్వామి, నాయకులు ఇనుగాల రవి, పెంబర్తి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

