పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ
ఏపీ:మద్యపాన నిషేధంలో భాగంగానే మద్యం ధరలను 75 శాతం పెంచినట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు.ఇవాళ కొలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ సమావేశమయ్యారు.మద్యం విక్రయాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే పరిమితం చేశామని, మద్యపాన నియంత్రణలో భాగంగా త్వరలోనే మద్యం దుకాణాలను తగ్గిస్తామని తెలిపారు.ఇప్పటికే పర్మిట్ రూంలను రద్దు చేశామన్నారు.