Wednesday, 12 August 2026
  • Home  
  • అంగన్వాడీ టీచర్లకు జ్ఞాన జ్యోతి 2 శిక్షణ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అంగన్వాడీ టీచర్లకు జ్ఞాన జ్యోతి 2 శిక్షణ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 12 (పున్నమి ప్రతినిధి) మనుబోలు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ టీచర్లకు జ్ఞాన జ్యోతి 2 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎంఈఓ హజరత్తయ్య తెలిపారు. కార్యక్రమాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో భాగంగా చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు శిక్షణలో నేర్చుకున్న అంశాలను కేంద్రాల్లో అమలు చేయాలన్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ ఆదినారాయణమ్మ మాట్లాడుతూ జ్ఞాన జ్యోతి శిక్షణ అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన బోధనకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. చిన్నారులకు సులభంగా అర్థమయ్యేలా బోధించే విధానాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్పీలు రామకృష్ణ, హరేంద్రారెడ్డి, సూపర్వైజర్ పద్మజ పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 12 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ టీచర్లకు జ్ఞాన జ్యోతి 2 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎంఈఓ హజరత్తయ్య తెలిపారు. కార్యక్రమాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో భాగంగా చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు శిక్షణలో నేర్చుకున్న అంశాలను కేంద్రాల్లో అమలు చేయాలన్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ ఆదినారాయణమ్మ మాట్లాడుతూ జ్ఞాన జ్యోతి శిక్షణ అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన బోధనకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. చిన్నారులకు సులభంగా అర్థమయ్యేలా బోధించే విధానాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్పీలు రామకృష్ణ, హరేంద్రారెడ్డి, సూపర్వైజర్ పద్మజ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.