నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరు రోజులుగా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తల మండల స్థాయి జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ముగింపు సమావేశంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయని ఐఎస్ఆర్ రాజేశ్వరి మాట్లాడుతూ బాలల రక్షణకు సురక్షిత వాతావరణం కల్పించాలని కోరారు.ఈ ఆరు రోజుల శిక్షణలో పాఠశాల సంసిద్ధత, ఆధార్ శిల, సమ్మిళిత విద్య, ఆరోగ్యం, పోషణ,శారీరక మేధో భాషా అభివృద్ధి వంటి పలు కీలక అంశాలపై అంగన్వాడీ వర్కర్లకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్పీలు మరియు మండలంలోని పలువురు అంగన్వాడీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రాల్లోనే బాలల రక్షణకు తొలి అడుగు