Wednesday, 16 September 2026
  • Home  
  • ⛔కాళంగి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి 35 కోట్లు మంజూరు చేసింది వైసీపీ ప్రభుత్వమే
- తిరుపతి

⛔కాళంగి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి 35 కోట్లు మంజూరు చేసింది వైసీపీ ప్రభుత్వమే

⛔దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ సూళ్లూరుపేట నియోజకవర్గ అభివృద్ధి పై చూపండి ⛔ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు కిలివేటి సంజీవయ్య మాజీ ఎమ్మెల్యే పున్నమి న్యూస్ సూళ్లూరుపేట 📌సూళ్లూరుపేటలో శ్రీ చెంగాళ్ళమ్మ గుడికి ఆనుకొని ఉన్న కాళంగి బ్రిడ్జి ని ప్రజల రాకపోకల కొరకు 1930 వ సంవత్సరంలో నిర్మించారని కాలక్రమేణ బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో గత వైసిపి ప్రభుత్వం కొత్త బ్రిడ్జి నిర్మాణానికి జీవో నెంబర్ 325 ద్వారా 35 కోట్లు మంజూరు చేపించామని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే కాళంగి నది బ్రిడ్జిని అనేక మార్లు పరిశీలించి ముఖ్యమంత్రికి నివేదికలు పంపాము కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు వస్తాయని చెప్పారని కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నప్పుడు బ్రిడ్జికి ఇరువైపులా పోల్స్ ను పెట్టడం ఎందుకని? వైసీపీ ప్రభుత్వంలో మంజూరైన 35 కోట్లు సరిపోకుంటే కొత్తగా 50 కోట్లు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణ పనులను శరవేగంగా మొదలుపెట్టి కాళంగి నదిపై ఉన్న ట్రాఫిక్ సమస్యలు తీర్చాలని కిలివేటి సంజీవయ్య తెలిపారు. 📌పెళ్లకూరు మండలం చిల్లకూరులో జరిగిన గొడవలలో సత్యనారాయణరెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని,చనిపోయిన వ్యక్తి గొడవలు జరిగిన ప్రాంతానికి చాలా దూరంలో చనిపోయాడని తెలిపారు. 📌ఓజిలి మండలం సగుటూరు చెరువులో ఉన్న నల్ల తుమ్మ కట్టెలను గత వైసీపీ ప్రభుత్వంలో 34 లక్షలకు రేటు నిర్ణయిస్తే పర్యావరణానికి ముప్పు అని కోర్టులో కేసు వేశారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అదే సగుటూరు చెరువులో ఉన్న నల్ల తుమ్మకట్టెలను 8ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు కట్ట పై ఉన్న కట్టేలను కూడా తక్కువ రేటుకే విక్రయించారని తెలిపారు. ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా సూళ్లూరుపేట నియోజకవర్గం అభివృద్ధి పై దృష్టి సారించాలని తెలిపారు.

⛔దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ సూళ్లూరుపేట నియోజకవర్గ అభివృద్ధి పై చూపండి

⛔ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు

కిలివేటి సంజీవయ్య మాజీ ఎమ్మెల్యే

పున్నమి న్యూస్ సూళ్లూరుపేట

📌సూళ్లూరుపేటలో శ్రీ చెంగాళ్ళమ్మ గుడికి ఆనుకొని ఉన్న కాళంగి బ్రిడ్జి ని ప్రజల రాకపోకల కొరకు 1930 వ సంవత్సరంలో నిర్మించారని కాలక్రమేణ బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో గత వైసిపి ప్రభుత్వం కొత్త బ్రిడ్జి నిర్మాణానికి జీవో నెంబర్ 325 ద్వారా 35 కోట్లు మంజూరు చేపించామని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే కాళంగి నది బ్రిడ్జిని అనేక మార్లు పరిశీలించి ముఖ్యమంత్రికి నివేదికలు పంపాము కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు వస్తాయని చెప్పారని కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నప్పుడు బ్రిడ్జికి ఇరువైపులా పోల్స్ ను పెట్టడం ఎందుకని? వైసీపీ ప్రభుత్వంలో మంజూరైన 35 కోట్లు సరిపోకుంటే కొత్తగా 50 కోట్లు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణ పనులను శరవేగంగా మొదలుపెట్టి కాళంగి నదిపై ఉన్న ట్రాఫిక్ సమస్యలు తీర్చాలని కిలివేటి సంజీవయ్య తెలిపారు.

📌పెళ్లకూరు మండలం చిల్లకూరులో జరిగిన గొడవలలో సత్యనారాయణరెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని,చనిపోయిన వ్యక్తి గొడవలు జరిగిన ప్రాంతానికి చాలా దూరంలో చనిపోయాడని తెలిపారు.

📌ఓజిలి మండలం సగుటూరు చెరువులో ఉన్న నల్ల తుమ్మ కట్టెలను గత వైసీపీ ప్రభుత్వంలో 34 లక్షలకు రేటు నిర్ణయిస్తే పర్యావరణానికి ముప్పు అని కోర్టులో కేసు వేశారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అదే సగుటూరు చెరువులో ఉన్న నల్ల తుమ్మకట్టెలను 8ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు కట్ట పై ఉన్న కట్టేలను కూడా తక్కువ రేటుకే విక్రయించారని తెలిపారు. ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా సూళ్లూరుపేట నియోజకవర్గం అభివృద్ధి పై దృష్టి సారించాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.