కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1(పున్నమి న్యూస్):
కాకినాడ అక్టోబర్ 1 క్రెడయ్ కాకినాడ చాప్టర్ ఆధ్వర్యంలో జనవరి 29 నుండి మూడు రోజులపాటు నిర్వహించనున్న7వ హోం ఎక్స్పో 2027 తాలూకు పోస్టర్ ని రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు డాక్టర్ పి.నారాయణ కూడా చైర్మన్ తలాటం సత్య తో కలిసి ఆవిష్కరించారు.స్థానిక జి ఆర్ టి లో జరిగిన క్రెడయ్ కాకినాడ చాప్టర్ కార్యవర్గ సమావేశంలో చైర్మన్ ఇంజనీర్ కమ్ముల విజయకృష్ణ ఆహ్వానం మేరకు మంత్రి నారాయణ పాల్గొని పోస్టర్ ఆవిష్కరించి ఇంజనీర్ల ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇటువంటి హోమ్ ఎక్స్పో వల్ల సామాన్యులకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. ప్రముఖ కంపెనీలు తాలూకు ఉత్పత్తులు ప్రముఖ సివిల్ ఇంజనీర్లు మరియు బిల్డర్స్ అందరూ ఒకే ప్రాంతంలో ఉండడం వల్ల గృహ నిర్మాణం చేపట్టే లబ్ధిదారులకు అనేక విషయాలలో అవగాహన కల్పించడమే కాక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్స్పో వల్ల లబ్ధి పొందుతారని మంత్రి చెప్పారు.ఎక్స్పోలో బ్యాంకుల తమతాలుకు స్టాల్ ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థిక సహకారంతోపాటు ప్రభుత్వపరంగా తీసుకోవలసిన అనుమతులు వంటి ప్రధాన విషయాలలో ఎక్స్పో ప్రతినిధులు వివరించడం వల్ల ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు వారధిగా ఉంటుందన్న అభిప్రాయాన్ని మంత్రి నారాయణ వ్యక్తం చేశారు.కూడా చైర్మన్ తలాటం సత్య మాట్లాడుతూ ప్రముఖ ఇంజనీర్లు మరియుక్రెడయ్ ప్రతినిధులు కలిసి నిర్వహిస్తున్న హోం ఎక్స్పో వల్ల బహుళ ప్రయోజనాలను సమాజానికి అందించడానికి ఎంతో వీలు కలుగుతుందన్నారు.నిర్మాణ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంశాలను ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజలు కూడా తెలుసుకోవడానికి ఈ ఎక్స్పోలు వారధిగా పనిచేస్తాయని అన్నారు. చైర్మన్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా కాకినాడలో హోమ్ ఎక్స్పో నిర్వహిస్తూ వేలాదిమంది లబ్ధిదారులకు మేలు చేకూర్చడమే కాక నాణ్యత నవ్యత మరియు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకు రావడం జరుగుతోందని చెప్పారు. కాకినాడ మెయిన్ రోడ్ లో ఉన్న ఎస్ఆర్ఎంటి ఫంక్షన్ హాల్ లో ఈ హోం ఎక్స్పో నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఉన్న ప్రముఖ కంపెనీల తాలూకు ప్రతినిధులు ఎక్స్పోలో పాల్గొని తమ ఉత్పత్తుల ప్రయోజనాలను వివరించడమే కాక ప్రత్యేక రాయితీలతో కూడిన లాభాన్ని కూడా వినియోగదారులకు అందించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.కార్యక్రమంలో క్రెడయ్ కాకినాడ చాప్టర్ అధ్యక్షులు ఇంజనీర్ మేడిద చక్రధర్ రావు, ప్రధాన కార్యదర్శి ఇంజనీర్ ఎస్ రాంబాబు,సంయుక్త కార్యదర్శి ఇంజనీర్ వాసు అడపా తో పాటు పలువురు పాల్గొన్నారు.

హోమ్ ఎక్స్పో వల్ల సామాన్యులకు ఎంతో మేలు. *క్రెడయ్ హోమ్ ఎక్స్పో పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి నారాయణ.
కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1(పున్నమి న్యూస్): కాకినాడ అక్టోబర్ 1 క్రెడయ్ కాకినాడ చాప్టర్ ఆధ్వర్యంలో జనవరి 29 నుండి మూడు రోజులపాటు నిర్వహించనున్న7వ హోం ఎక్స్పో 2027 తాలూకు పోస్టర్ ని రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు డాక్టర్ పి.నారాయణ కూడా చైర్మన్ తలాటం సత్య తో కలిసి ఆవిష్కరించారు.స్థానిక జి ఆర్ టి లో జరిగిన క్రెడయ్ కాకినాడ చాప్టర్ కార్యవర్గ సమావేశంలో చైర్మన్ ఇంజనీర్ కమ్ముల విజయకృష్ణ ఆహ్వానం మేరకు మంత్రి నారాయణ పాల్గొని పోస్టర్ ఆవిష్కరించి ఇంజనీర్ల ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇటువంటి హోమ్ ఎక్స్పో వల్ల సామాన్యులకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. ప్రముఖ కంపెనీలు తాలూకు ఉత్పత్తులు ప్రముఖ సివిల్ ఇంజనీర్లు మరియు బిల్డర్స్ అందరూ ఒకే ప్రాంతంలో ఉండడం వల్ల గృహ నిర్మాణం చేపట్టే లబ్ధిదారులకు అనేక విషయాలలో అవగాహన కల్పించడమే కాక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్స్పో వల్ల లబ్ధి పొందుతారని మంత్రి చెప్పారు.ఎక్స్పోలో బ్యాంకుల తమతాలుకు స్టాల్ ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థిక సహకారంతోపాటు ప్రభుత్వపరంగా తీసుకోవలసిన అనుమతులు వంటి ప్రధాన విషయాలలో ఎక్స్పో ప్రతినిధులు వివరించడం వల్ల ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు వారధిగా ఉంటుందన్న అభిప్రాయాన్ని మంత్రి నారాయణ వ్యక్తం చేశారు.కూడా చైర్మన్ తలాటం సత్య మాట్లాడుతూ ప్రముఖ ఇంజనీర్లు మరియుక్రెడయ్ ప్రతినిధులు కలిసి నిర్వహిస్తున్న హోం ఎక్స్పో వల్ల బహుళ ప్రయోజనాలను సమాజానికి అందించడానికి ఎంతో వీలు కలుగుతుందన్నారు.నిర్మాణ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంశాలను ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజలు కూడా తెలుసుకోవడానికి ఈ ఎక్స్పోలు వారధిగా పనిచేస్తాయని అన్నారు. చైర్మన్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా కాకినాడలో హోమ్ ఎక్స్పో నిర్వహిస్తూ వేలాదిమంది లబ్ధిదారులకు మేలు చేకూర్చడమే కాక నాణ్యత నవ్యత మరియు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకు రావడం జరుగుతోందని చెప్పారు. కాకినాడ మెయిన్ రోడ్ లో ఉన్న ఎస్ఆర్ఎంటి ఫంక్షన్ హాల్ లో ఈ హోం ఎక్స్పో నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఉన్న ప్రముఖ కంపెనీల తాలూకు ప్రతినిధులు ఎక్స్పోలో పాల్గొని తమ ఉత్పత్తుల ప్రయోజనాలను వివరించడమే కాక ప్రత్యేక రాయితీలతో కూడిన లాభాన్ని కూడా వినియోగదారులకు అందించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.కార్యక్రమంలో క్రెడయ్ కాకినాడ చాప్టర్ అధ్యక్షులు ఇంజనీర్ మేడిద చక్రధర్ రావు, ప్రధాన కార్యదర్శి ఇంజనీర్ ఎస్ రాంబాబు,సంయుక్త కార్యదర్శి ఇంజనీర్ వాసు అడపా తో పాటు పలువురు పాల్గొన్నారు.

