కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1 (పున్నమి న్యూస్):
స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ వృద్దాశ్రమం లో శ్రీ సత్య దంత వైద్యశాల వైద్యులు డా అడ్డాల సత్యనారాయణ ఆధ్వర్యాన వృద్ధులకు పండ్లు పంపిణీ చేసారు,
ఈ సందర్భంగా డా అడ్డాల మాట్లాడుతూ
“ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటారని,
ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 1990 డిసెంబర్ 14న ఆమోదించిన తీర్మానం ప్రకారం, 1991 అక్టోబర్ 1 నుంచి ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం ప్రారంభించారని,
సమాజం, కుటుంబం మరియు దేశ ప్రగతిలో వయోవృద్ధులు అందించిన సేవలను స్మరించుకోవడం, వృద్ధాప్యంలో ఎదురయ్యే శారీరక, మానసిక, ఆర్థిక మరియు సామాజిక సమస్యల పట్ల సమాజంలో చైతన్యం తీసుకురావడం,
వారిని నిర్లక్ష్యం చేయకుండా, హింస లేదా వివక్షకు గురికాకుండా చూసుకోవడం మరియు వారి ప్రాథమిక హక్కులను కాపాడడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు,
రోజువారీ జీవితంలో వృద్ధులతో సమయం గడపడం, వారి మాటలను శ్రద్ధగా వినడం.
అనుభవాన్ని ఉపయోగించుకోవడం,వారి వద్ద ఉన్న జీవిత అనుభవం మరియు జ్ఞానాన్ని తర్వాతి తరాలకు మార్గదర్శకంగా ఉపయోగించడం చేయాలని, వారి ఆహారం, మందులు మరియు మానసిక ఉల్లాసం పట్ల క్రమం తప్పకుండా శ్రద్ధ వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్ చరణ్, వీరభద్ర రావు, ఆశ్రమంలోని వృద్ధులు పాల్గొన్నారు.

”చిన్నతనంలో నడక నేర్పిన పెద్దలకు, వృద్ధాప్యంలో తోడుగా నిలవడమే మనం ఇచ్చే అతిపెద్ద గౌరవం.”.డా అడ్డాల
కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1 (పున్నమి న్యూస్): స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ వృద్దాశ్రమం లో శ్రీ సత్య దంత వైద్యశాల వైద్యులు డా అడ్డాల సత్యనారాయణ ఆధ్వర్యాన వృద్ధులకు పండ్లు పంపిణీ చేసారు, ఈ సందర్భంగా డా అడ్డాల మాట్లాడుతూ “ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటారని, ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 1990 డిసెంబర్ 14న ఆమోదించిన తీర్మానం ప్రకారం, 1991 అక్టోబర్ 1 నుంచి ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం ప్రారంభించారని, సమాజం, కుటుంబం మరియు దేశ ప్రగతిలో వయోవృద్ధులు అందించిన సేవలను స్మరించుకోవడం, వృద్ధాప్యంలో ఎదురయ్యే శారీరక, మానసిక, ఆర్థిక మరియు సామాజిక సమస్యల పట్ల సమాజంలో చైతన్యం తీసుకురావడం, వారిని నిర్లక్ష్యం చేయకుండా, హింస లేదా వివక్షకు గురికాకుండా చూసుకోవడం మరియు వారి ప్రాథమిక హక్కులను కాపాడడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు, రోజువారీ జీవితంలో వృద్ధులతో సమయం గడపడం, వారి మాటలను శ్రద్ధగా వినడం. అనుభవాన్ని ఉపయోగించుకోవడం,వారి వద్ద ఉన్న జీవిత అనుభవం మరియు జ్ఞానాన్ని తర్వాతి తరాలకు మార్గదర్శకంగా ఉపయోగించడం చేయాలని, వారి ఆహారం, మందులు మరియు మానసిక ఉల్లాసం పట్ల క్రమం తప్పకుండా శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్ చరణ్, వీరభద్ర రావు, ఆశ్రమంలోని వృద్ధులు పాల్గొన్నారు.

