Saturday, 5 September 2026
  • Home  
  • హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌పై కొత్తలంక గ్రామంలో అవగాహన సమావేశం మరియు ర్యాలీ
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌పై కొత్తలంక గ్రామంలో అవగాహన సమావేశం మరియు ర్యాలీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు మండలం కొత్తలంక గ్రామంలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దిశా,బీమాభాయి మహిళా మండలి సహకారంతో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య అంశాలపై మరియు హెచ్ ఐ వి ఎయిడ్స్ మరియు లైంగిక వ్యాధులపై అవగాహనా కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవీ ఎలా సంక్రమిస్తుంది, ఎలా సంక్రమించదు, హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పట్ల గల అపోహలు, హెచ్‌ఐవీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెచ్‌ఐవీ సోకిన వారికి అందుబాటులో ఉన్న చికిత్సా సేవలు, క్షయ వ్యాధి, డ్రగ్స్ వినియోగం, హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్షత చూపకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌కు సంబంధించిన ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే 1097 టోల్‌ఫ్రీ నంబర్, హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్ చట్టం 2017, ఏఆర్‌టీ మందుల కేంద్రాలు తదితర అంశాలపై వివరించారు. విద్యార్థులకు ఐఈసీ కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో హెచ్ఐవి యాప్ ద్వారా సర్వే పూర్తి చేశారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు మండలం కొత్తలంక గ్రామంలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో
హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దిశా,బీమాభాయి మహిళా మండలి సహకారంతో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య అంశాలపై మరియు హెచ్ ఐ వి ఎయిడ్స్ మరియు లైంగిక వ్యాధులపై అవగాహనా కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవీ ఎలా సంక్రమిస్తుంది, ఎలా సంక్రమించదు, హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పట్ల గల అపోహలు, హెచ్‌ఐవీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెచ్‌ఐవీ సోకిన వారికి అందుబాటులో ఉన్న చికిత్సా సేవలు, క్షయ వ్యాధి, డ్రగ్స్ వినియోగం, హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్షత చూపకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌కు సంబంధించిన ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే 1097 టోల్‌ఫ్రీ నంబర్, హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్ చట్టం 2017, ఏఆర్‌టీ మందుల కేంద్రాలు తదితర అంశాలపై వివరించారు. విద్యార్థులకు ఐఈసీ కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో హెచ్ఐవి యాప్ ద్వారా సర్వే పూర్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.