Friday, 10 July 2026
  • Home  
  • “హస్తకళాకారుల ఆరోగ్యానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ.. ఏటికొప్పాకలో ఉచిత మెడికల్ క్యాంప్”
- అనకాపల్లి

“హస్తకళాకారుల ఆరోగ్యానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ.. ఏటికొప్పాకలో ఉచిత మెడికల్ క్యాంప్”

ప్రపంచవ్యాప్తంగా ఏటికొప్పాక లక్కబొమ్మలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన హస్తకళాకారులు వృత్తిరీత్యా రసాయనాలు, రంగులు, చెక్కపనులతో నిరంతరం పనిచేయడం వల్ల చర్మవ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, కంటి సంబంధిత ఇబ్బందులు తదితర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందర్ విజయ్ కుమార్ సమక్షంలో నిర్వహించిన ఈ శిబిరంలో హస్తకళాకారులతో పాటు గ్రామ ప్రజలు, చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనరల్ మెడిసిన్, చర్మవ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, కంటి వైద్యం తదితర విభాగాల్లో వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించి తగిన వైద్య సేవలు అందించారు. కార్యక్రమ ఏర్పాట్లను ఎంపీడీఓ దీపిక, గ్రామ కార్యదర్శి గిరిప్రసాద్ పర్యవేక్షించారు. వైద్య బృందంలో డీఎంహెచ్‌ఓ ఎం. హేమావతి, డీపీఎంఓ ఆర్. వెంకటేష్, డా. సుగుణ, డా. మానస, సీహెచ్‌ఓ కృష్ణవేణి, సీహెచ్‌ఓ అమ్మాజీ, ఏఎన్‌ఎమ్ లక్ష్మి, ఆశా వర్కర్లు పాల్గొని వైద్య సేవలు అందించారు. కూటమి నాయకుల్లో ఎంపీపీ రాజన్న సూర్యచంద్ర శేషగిరిరావు (శేషు), జనసేన మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, వైస్ ఎంపీపీ నగిరెడ్డి అచ్చయ్య నాయుడు, అన్నం స్వరాజీరావు, గొంతుమూర్తి కొండయ్య నాయుడు, కర్రి సింహాచలం, మాజీ సర్పంచ్ భజంత్రీల లక్ష్మీరాము, భజంత్రీల శ్రీను, కొత్తవల సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, హస్తకళాకారులు మాట్లాడుతూ తమ ఆరోగ్య సమస్యలను గుర్తించి ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఏటికొప్పాక లక్కబొమ్మలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన హస్తకళాకారులు వృత్తిరీత్యా రసాయనాలు, రంగులు, చెక్కపనులతో నిరంతరం పనిచేయడం వల్ల చర్మవ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, కంటి సంబంధిత ఇబ్బందులు తదితర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
ఎలమంచిలి ఎమ్మెల్యే సుందర్ విజయ్ కుమార్ సమక్షంలో నిర్వహించిన ఈ శిబిరంలో హస్తకళాకారులతో పాటు గ్రామ ప్రజలు, చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనరల్ మెడిసిన్, చర్మవ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, కంటి వైద్యం తదితర విభాగాల్లో వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించి తగిన వైద్య సేవలు అందించారు.
కార్యక్రమ ఏర్పాట్లను ఎంపీడీఓ దీపిక, గ్రామ కార్యదర్శి గిరిప్రసాద్ పర్యవేక్షించారు. వైద్య బృందంలో డీఎంహెచ్‌ఓ ఎం. హేమావతి, డీపీఎంఓ ఆర్. వెంకటేష్, డా. సుగుణ, డా. మానస, సీహెచ్‌ఓ కృష్ణవేణి, సీహెచ్‌ఓ అమ్మాజీ, ఏఎన్‌ఎమ్ లక్ష్మి, ఆశా వర్కర్లు పాల్గొని వైద్య సేవలు అందించారు.
కూటమి నాయకుల్లో ఎంపీపీ రాజన్న సూర్యచంద్ర శేషగిరిరావు (శేషు), జనసేన మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, వైస్ ఎంపీపీ నగిరెడ్డి అచ్చయ్య నాయుడు, అన్నం స్వరాజీరావు, గొంతుమూర్తి కొండయ్య నాయుడు, కర్రి సింహాచలం, మాజీ సర్పంచ్ భజంత్రీల లక్ష్మీరాము, భజంత్రీల శ్రీను, కొత్తవల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, హస్తకళాకారులు మాట్లాడుతూ తమ ఆరోగ్య సమస్యలను గుర్తించి ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.