Monday, 10 August 2026
  • Home  
  • స్థానిక ఎన్నికలకు బీజేపీ సన్నద్ధం.. బూత్‌ స్థాయి నుంచి పార్టీ బలోపేతం: ఆడారి శ్రీధర్‌
- అనకాపల్లి

స్థానిక ఎన్నికలకు బీజేపీ సన్నద్ధం.. బూత్‌ స్థాయి నుంచి పార్టీ బలోపేతం: ఆడారి శ్రీధర్‌

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 9 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్తూ విశ్వగురువుగా ఎదుగుతోందని ఎలమంచిలి మండల బీజేపీ నూతన ఇన్‌చార్జి ఆడారి శ్రీధర్‌ అన్నారు. పులపర్తిలో నిర్వహించిన మండల బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోదీ పాలన దేశాన్ని స్వర్ణయుగం వైపు నడిపిస్తోందని పేర్కొన్నారు. ఎలమంచిలి మండలంలోని ప్రతి బూత్‌, ప్రతి గ్రామాన్ని త్వరలో సందర్శించి పార్టీని మరింత పటిష్ఠం చేస్తానని శ్రీధర్‌ తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు ఇప్పటి నుంచే సమష్టిగా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశానికి మండల బీజేపీ అధ్యక్షుడు అగ్రహారపు కుమార్‌స్వామి అధ్యక్షత వహించారు. బీజేపీ అధికారం కోసం కాకుండా దేశ క్షేమం, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యనిర్వాహక సభ్యుడు కొల్లి సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి ధార నూకరాజు, సోషల్‌ మీడియా ఇన్‌చార్జి రాజేష్‌, మండల కార్యవర్గ సభ్యులు, మహిళా కార్యకర్తలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 9 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్తూ విశ్వగురువుగా ఎదుగుతోందని ఎలమంచిలి మండల బీజేపీ నూతన ఇన్‌చార్జి ఆడారి శ్రీధర్‌ అన్నారు. పులపర్తిలో నిర్వహించిన మండల బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోదీ పాలన దేశాన్ని స్వర్ణయుగం వైపు నడిపిస్తోందని పేర్కొన్నారు.
ఎలమంచిలి మండలంలోని ప్రతి బూత్‌, ప్రతి గ్రామాన్ని త్వరలో సందర్శించి పార్టీని మరింత పటిష్ఠం చేస్తానని శ్రీధర్‌ తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు ఇప్పటి నుంచే సమష్టిగా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
సమావేశానికి మండల బీజేపీ అధ్యక్షుడు అగ్రహారపు కుమార్‌స్వామి అధ్యక్షత వహించారు. బీజేపీ అధికారం కోసం కాకుండా దేశ క్షేమం, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యనిర్వాహక సభ్యుడు కొల్లి సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి ధార నూకరాజు, సోషల్‌ మీడియా ఇన్‌చార్జి రాజేష్‌, మండల కార్యవర్గ సభ్యులు, మహిళా కార్యకర్తలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.