Friday, 7 August 2026
  • Home  
  • స్కూల్ ఫీజులపై విద్యాశాఖ కొరడా.. వివరాల ప్రదర్శన తప్పనిసరి
- ఖమ్మం

స్కూల్ ఫీజులపై విద్యాశాఖ కొరడా.. వివరాల ప్రదర్శన తప్పనిసరి

ఖమ్మం ఆగష్టు (పున్నమి న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ) ప్రవేటు,ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజుల విషయంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పూర్తి ఫీజు వివరాలను విద్యార్థులు, తల్లిదండ్రులకు స్పష్టంగా కనిపించేలా తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించింది. ప్రతి పాఠశాలలోని నోటీసు బోర్డుతో పాటు పాఠశాల వెబ్‌సైట్‌లోనూ ఫీజు నిర్మాణాన్ని అందుబాటులో ఉంచాలని సూచించింది. అంతేకాకుండా పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన పోర్టల్‌లో కూడా ఫీజుల వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేసింది. నిబంధనలు పాటించకుండా ఫీజు వివరాలను ప్రదర్శించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు స్ట్రక్చర్‌ను బహిరంగంగా ప్రదర్శించని పాఠశాలలను గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పేర్కొంది. ఫీజుల విషయంలో పారదర్శకత పాటించేలా పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.

ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ )

ప్రవేటు,ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజుల విషయంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పూర్తి ఫీజు వివరాలను విద్యార్థులు, తల్లిదండ్రులకు స్పష్టంగా కనిపించేలా తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించింది. ప్రతి పాఠశాలలోని నోటీసు బోర్డుతో పాటు పాఠశాల వెబ్‌సైట్‌లోనూ ఫీజు నిర్మాణాన్ని అందుబాటులో ఉంచాలని సూచించింది. అంతేకాకుండా పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన పోర్టల్‌లో కూడా ఫీజుల వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేసింది. నిబంధనలు పాటించకుండా ఫీజు వివరాలను ప్రదర్శించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు స్ట్రక్చర్‌ను బహిరంగంగా ప్రదర్శించని పాఠశాలలను గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పేర్కొంది. ఫీజుల విషయంలో పారదర్శకత పాటించేలా పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.