నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయంలో చేపల వేట నిషేధం అమలులో ఉన్నప్పటికీ భారీ స్థాయిలో అక్రమ వేట కొనసాగుతోందని స్థానిక జాలర్లు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి జాలర్లను రప్పించి టన్నుల కొద్దీ చేపలను పట్టి విక్రయిస్తున్నారని, దీనివల్ల కోట్ల రూపాయల విలువైన మత్స్య సంపద నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ అక్రమ రవాణాపై తక్షణమే సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఉక్కుపాదం మోపాలని,స్థానిక మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. నిషేధిత సమయంలోనూ యథేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమ వేటను అరికట్టకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.

సోమశిలలో భారీగా అక్రమ చేపల వేట.. అధికారుల మౌనం!