సింహాచలం గిరి ప్రదర్శన సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తుల సేవార్థం విశాఖ ఎన్విరో ల్యాబ్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చల్లని,మజ్జిగ, చల్లని మంచినీరు, ప్రసాదాల పంపిణీ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సేవా కార్యక్రమానికి సంస్థ సీఈఓ డాక్టర్ విశ్వనాథం (M.Sc., Ph.D., PDG), నాయకత్వం వహించారు, ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ P. పుల్లారెడ్డి, డైరెక్టర్ వానపల్లి శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆర్. సత్యనారాయణ లెంక మధు, మరియు. సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మండుటెండలో అలసటతో వచ్చిన భక్తులకు చల్లని మజ్జిగ, మంచినీరు అందించి వారి దాహాన్ని తీర్చడమే కాకుండా, సేవా ధర్మానికి సజీవ ఉదాహరణగా నిలిచారు.
“మానవ సేవే మాధవ సేవ” అనే మహోన్నత భావనను కార్యరూపంలో చూపించిన ఈ కార్యక్రమం భక్తుల హృదయాలను హత్తుకుంది. లాభాపేక్ష కంటే సమాజ శ్రేయస్సుకే ప్రాధాన్యం ఇస్తూ, అవసరమైన సమయంలో ప్రజలకు అండగా నిలవడం విశాఖ ఎన్విరో ల్యాబ్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచింది.
సేవ చేయడానికి సంపద కంటే మంచి మనసు గొప్పదని నిరూపించిన సంస్థ యాజమాన్యాన్ని భక్తులు, స్థానికులు, పలువురు సామాజికవేత్తలు అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని పెంపొందించడమే కాకుండా, యువతకు ఆదర్శంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.






