ఆత్మకూరు, మే 1 (పున్నమి ప్రతినిధి) :
శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి జన్మదిన వేడుకలు పట్టణంలోని స్పార్క్ సిటీ వేదికగా అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం అభిమానులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల సందడితో పండుగ వాతావరణాన్ని తలపించింది.

ఈ కార్యక్రమ ప్రాంగణం బాణాసంచా వెలుగులతో కళకళలాడగా, అభిమానుల జయజయధ్వానాల మధ్య పరమేశ్వర రెడ్డి కేక్ కట్ చేసి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన అతిథులు ఆయనకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యాన్నదానం మరియు పలు సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలను పలువురు ప్రముఖులు ప్రశంసించారు.సమాజ సేవలో ముందుండి సేవలందిస్తున్న పరమేశ్వర రెడ్డి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని అభిమానులు ఆకాంక్షించారు.

