Sunday, 23 August 2026
  • Home  
  • సూళ్ళూరుపేట, తడ, పెళ్లకూరులకు ఆ పేర్లు ఎలా వచ్చాయి?
- Featured - ఆంధ్రప్రదేశ్

సూళ్ళూరుపేట, తడ, పెళ్లకూరులకు ఆ పేర్లు ఎలా వచ్చాయి?

సూళ్లూరుపేట : సూళ్లూరుపేట అనగానే గుర్తొచ్చేవి కాళంగినది, ఆ నదీ తీరాన వెలసివున్న పరమ పావని శ్రీ చెంగాళమ్మ అమ్మవారు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన రాకెట్‌ కేంద్రం శ్రీహరికోట, అతి ప్రాచీనమైన మన్నారుపోలూరులోని రాజగోపాలస్వామి ఆలయం. తెలుగు, తమిళ సాంప్రదాయాల మేలుకలయిక సూళ్లూరుపేట.  సుళ్ళూరుపేటకు చెంగాళమ్మ ఆలయం వల్ల ఈ పేరు వచ్చింది. అది ఎలాగంటే చెంగాలమ్మ గుడికి ఉత్సవాలు జరిగినప్పుడు ఒక పెద్ద కర్రకు మేకని కట్టి మూడు సార్లు గాలిలో తిప్పుతారు. సుళ్ళు తిరుగుతున్న నీటిలో దొరికిన దానికి గుర్తుగా ఇలా తిప్పటం జరుగుతున్నది. ఈ విధంగా తిప్పడాన్ని ”సుళ్ళు ఉత్సవం” అంటారు. ఆ విధంగా ఈ ఊరికి సూళ్ళురుపేట అని పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని దర్శించుకొనేందుకు రోజూ 2 వేల మంది వస్తుంటారు. తడ : మనజిల్లాకు సరిహద్దు మండలం ‘తడ’. తడ వృక్షాలు ఎక్కువగా వున్న ప్రాంతం ‘తడ’గా పిలవబడింది. తడ అంటే ధన్వమనెడు చెట్టు. ధనుర్వుక్షం అని కూడా అంటారు. దీని కట్టెలు ఇండ్లకు, ఆకులు విస్తళ్లకు ఉపయోగిస్తారు. పెళ్ళకూరు : యుద్ధంలో వీరస్వర్గం అలంకరించిన ఒక వీరుని పేరు మీద ఏర్పడిన గ్రామం తాళ్వాయిపాడు. బండ్లమాంబ వారి చండికా పరమేశ్వరి ఆలయం, పాఠశాల ఈ మండలం ప్రత్యేకతలు.

సూళ్లూరుపేట : సూళ్లూరుపేట అనగానే గుర్తొచ్చేవి కాళంగినది, ఆ నదీ తీరాన వెలసివున్న పరమ పావని శ్రీ చెంగాళమ్మ అమ్మవారు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన రాకెట్‌ కేంద్రం శ్రీహరికోట, అతి ప్రాచీనమైన మన్నారుపోలూరులోని రాజగోపాలస్వామి ఆలయం. తెలుగు, తమిళ సాంప్రదాయాల మేలుకలయిక సూళ్లూరుపేట.  సుళ్ళూరుపేటకు చెంగాళమ్మ ఆలయం వల్ల ఈ పేరు వచ్చింది. అది ఎలాగంటే చెంగాలమ్మ గుడికి ఉత్సవాలు జరిగినప్పుడు ఒక పెద్ద కర్రకు మేకని కట్టి మూడు సార్లు గాలిలో తిప్పుతారు. సుళ్ళు తిరుగుతున్న నీటిలో దొరికిన దానికి గుర్తుగా ఇలా తిప్పటం జరుగుతున్నది. ఈ విధంగా తిప్పడాన్ని ”సుళ్ళు ఉత్సవం” అంటారు. ఆ విధంగా ఈ ఊరికి సూళ్ళురుపేట అని పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని దర్శించుకొనేందుకు రోజూ 2 వేల మంది వస్తుంటారు.
తడ : మనజిల్లాకు సరిహద్దు మండలం ‘తడ’. తడ వృక్షాలు ఎక్కువగా వున్న ప్రాంతం ‘తడ’గా పిలవబడింది. తడ అంటే ధన్వమనెడు చెట్టు. ధనుర్వుక్షం అని కూడా అంటారు. దీని కట్టెలు ఇండ్లకు, ఆకులు విస్తళ్లకు
ఉపయోగిస్తారు.
పెళ్ళకూరు : యుద్ధంలో వీరస్వర్గం అలంకరించిన ఒక వీరుని పేరు మీద ఏర్పడిన గ్రామం తాళ్వాయిపాడు. బండ్లమాంబ వారి చండికా పరమేశ్వరి ఆలయం, పాఠశాల ఈ మండలం ప్రత్యేకతలు.

1 Comment

  1. tlover tonet

    September 27, 2019

    That is really interesting, You’re a very skilled blogger. I’ve joined your feed and look forward to looking for extra of your great post. Additionally, I have shared your website in my social networks!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.