*సూళ్లూరుపేట:* సూళ్లూరుపేట పట్టణంలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు ముమ్మరం చేస్తున్నారు.
పట్టణంలో రూ.15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న *కమాండ్ కంట్రోల్ సెంటర్, సీసీ కెమెరాల పనులకు* గురువారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
సూళ్లూరుపేట ఎమ్మెల్యే *డా. నెలవల విజయశ్రీ* ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ… పట్టణంలోని *50 ప్రాంతాల్లో 110 అత్యాధునిక సీసీ కెమెరాలను* ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల నేరాలను అరికట్టడంతో పాటు, ట్రాఫిక్ నియంత్రణ కూడా సులభం అవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


