*నత్తనడకన సూళ్లూరుపేట-కోటపోలూరు రోడ్డు పనులు!*
సూళ్లూరుపేట-కోటపోలూరు రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు డి. కిరణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. మెటల్ వేసి నెలరోజులుగా వదిలేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, బైకులు స్లిప్ అయి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. టైర్లు దెబ్బతిని జేబుకు చిల్లు పడుతోందని, వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.


