తొట్టంబేడు, జూన్ 29, (పున్నమి న్యూస్) : సహకార వారోత్సవాల సందర్భంగా “సహకారం ద్వారా సమృద్ధి” అనే నినాదంతో తొట్టంబేడు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా సహకార శాఖ ఆదేశాల మేరకు సంఘ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని సంఘ అధ్యక్షులు బీమాల భాస్కర్ ముదిరాజ్, సహకార శాఖ అధికారి, సంఘ సీఈవో పి. చిరంజీవిరెడ్డి, తెదేపా మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు బాలసుబ్రమణ్యం సంయుక్తంగా మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు భాస్కర్ ముదిరాజ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించాలంటే విస్తృతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. సహకార సంఘాలు రైతులకు ఆర్థిక సేవలు అందించడంతో పాటు సమాజాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక బాధ్యతల నిర్వహణలోనూ ముందుండటం సంతోషకరమని సంఘ సీఈవో పి. చిరంజీవిరెడ్డి పేర్కొన్నారు. సహకార రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక రైతులు, సంఘ ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ రకాల మొక్కలను నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.

సహకార వారోత్సవాల్లో హరిత సందేశం