*”సర్వేపల్లి లో నేతన్నల పరిహారం.. పచ్చనేతల ఫలహారం – కాకాణి”**SPSR నెల్లూరు జిల్లా* *తేదీ 19.08.2026**శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలం, నేదురుమల్లి గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు “డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు*- నేదురుమల్లి గ్రామానికి విచ్చేసిన కాకాణి కి ఘన స్వాగతం పలికి, ఆప్యాయంగా పలకరించిన, గ్రామస్తులు, మహిళలు, – నేదురుమల్లి గ్రామంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమం, తమ హయాంలోనే జరిగిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, శూన్యం అంటూ, కాకాణి ఎదుట స్పష్టం చేసిన గ్రామస్తులు.. కాకాణి మాట్లాడతూ……- సర్వేపల్లి నియోజకవర్గంలో నేతన్నలకు ప్రభుత్వం మంజూరు చేసిన, 25000 రూపాయలలో తెలుగు తమ్ముళ్లు చేతివాటం ప్రదర్శిస్తూ, ఒక్కొక్కరి దగ్గర 2000 చొప్పున వసూలు చేయడం దుర్మార్గమని కాకాణి పేర్కొన్నారు- గ్రామాలలో అభివృద్ధి, సంక్షేమం, గురించి బహిరంగ చర్చకు సిద్ధమా అని సోమిరెడ్డి సవాల్ విసురుతూ, మేము సిద్ధమని ప్రతి సవాల్ విసరగానే తోకముడిచి పలాయనం చిత్తగిస్తూ పారిపోతున్నాడు- గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, గురించి గొప్పగా చెప్పుకుంటూ, సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకు, సోమిరెడ్డి అల్లుడు, చేస్తున్న అవినీతిని గురించి, ప్రజలు “ఛీ” కొడుతున్నారు – నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్న చందంగా, సోమిరెడ్డి ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతూ, నాయకుల వద్ద, నాకు ఇదే చివరి అవకాశం, సంపాదించుకోక తప్పదు అంటూ, బాహాటంగానే చెప్ప డాన్ని చూసి, తెలుగుదేశం పార్టీ నాయకులే విస్తు పోతున్నారు – గ్రామాలలో మంచినీరు అందక, వీధి దీపాలు వెలగక, కనీసం పారిశుధ్యం నిర్వహించక, ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం- సోమిరెడ్డి మాత్రం ప్రజల సమస్యలు పక్కన పెట్టి, గ్రావెల్, మట్టి, ఇసుక, బూడిద, దోచేసుకుంటూ, లేఔట్ల దగ్గర డబ్బులు దండుకుంటూ, ఉద్యోగాల పేరిట వసూళ్లకు పాల్పడుతూ, దేవాదాయ భూములు, ప్రభుత్వ భూములు, రైల్వే శాఖకు చెందిన భూములు, అటవీ శాఖకు చెందిన భూములు, ఆక్రమించి అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు – సోమిరెడ్డి ఇప్పటికైనా లేఔట్ల దగ్గర వసూలు చేసి, సోమిరెడ్డి అల్లుడికి విల్లా కొనిచ్చిన మాట వాస్తవమా, కాదా, ప్రజలకు తెలియజేయాలి – సోమిరెడ్డి కుటుంబం, లేఔట్ల యజమానుల దగ్గర డబ్బులు తీసుకోకపోయి ఉంటే, సోమిరెడ్డి ప్రమాణానికి సిద్ధపడి, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదంటూ దేవుడి దగ్గర ప్రమాణం చేసి, తన నిజాయితీని నిరూపించుకోవాలి – సోమిరెడ్డి ముమ్మాటికి అవినీతిపరుడే అంటూ, సర్వేపల్లి ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు – రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని పుట్టి (850) కేజీలు,16 వేల రూపాయలకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడితే, దళారులు, వ్యాపారులు, మిల్లర్లు మాత్రం, రైతుల దగ్గర అతి తక్కువ ధరకే కొనుక్కొని, మూడు నెలల సమయంలోనే పుట్టి (850 కేజీలు )36 వేల రూపాయల చొప్పున అమ్ముకోవడం చూస్తుంటే, కూటమిపాలనలో రైతుల శ్రమ ఎలా దోపిడీకి గురవుతుందో స్పష్టంగా కనిపిస్తుంది, – చంద్రబాబు, రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు, జగన్మోహన్ రెడ్డి గారి లాగా, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, రైతులకు అండగా నిలవకపోవడంతోనే రైతులు తామంతా దోపిడి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు – అధికారం లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, మాజీలుగా మిగిలిపోయినా ఇప్పటికీ ప్రజల సమస్యల పట్ల చొరవ చూపించి, పరిష్కరించే దానికి, సొంత నిధులు సైతం వెచ్చించడానికి ముందుకు రావడాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా- గ్రామపంచాయతీలలో నిధులు ఉన్నా, స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో సోమిరెడ్డి ముఠా, గ్రామ పంచాయతీలలో నిధులు కాజేయడానికి ప్రయత్నించడం తప్ప, గ్రామాల అభివృద్ధి, గ్రామ ప్రజల సంక్షేమాన్ని గురించి పట్టించుకునే పరిస్థితుల్లో లేరు- అధికారం ఉన్నా, లేకపోయినా, నిత్య ప్రజలలో ఉంటూ, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తాం అని పేర్కొన్నారు.- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేవూరు చంద్రమౌళి కుమార్తె భార్గవి, ముందస్తు వివాహ వేడుకలో పాల్గొని నూతన వధువును ఆశీర్వదించిన కాకాణి









