సంగం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, సంగం ఆర్.ఎస్. లో మెగా తల్లిదండ్రుల–ఉపాధ్యాయుల సమావేశం (MEGA PTM శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) చైర్మన్ శ్రీమతి పావని పాఠశాల ఉపాధ్యాయులు వి. నరేష్, పి. ఈశ్వరమ్మ, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామస్థులు, పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సమావేశంలో ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యా పురోగతి, హాజరు, అభ్యాస ఫలితాలు, GFLN కార్యక్రమాలు, LEAP మరియు DIKSHA యాప్ల వినియోగం, పాఠశాలలో అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో తెలియజేశారు.
తల్లిదండ్రులు పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని, విద్యార్థుల క్రమశిక్షణ, హాజరు మరియు విద్యాభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని హామీ ఇచ్చారు
కార్యక్రమంలో భాగంగా పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు మరియు తల్లిదండ్రుల కోసం వినోదాత్మక ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులుఅందజేసిఅభినందించారు. అలాగే విద్యార్థుల తయారు చేసిన బోధనా సామగ్రి, TLMలు, FLN ప్రదర్శనలు మరియు పాఠశాల విజయాల ఫోటో గ్యాలరీని సందర్శించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కృషిని ప్రశంసించారు.చివరగా విచ్చేసిన అందరికీ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ప్రత్యేక మెనూతో భోజనం వడ్డించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, SMC సభ్యులు, గ్రామస్థులు, పూర్వ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు కలిసి మన బడి – మన గర్వం అనే నినాదంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.



