శ్రీ కాళహస్తి, జూన్ 21, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్పీబీఎస్ జెడ్పీ బాయ్స్ హైస్కూల్ మైదానంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి అండర్-19 మండలాల ఇన్విటేషన్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా ముగిసింది. స్థానిక సీనియర్ క్రీడాకారులు, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో ఈ పోటీలను నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో శ్రీకాళహస్తి, తొట్టంబేడు, కేవీబీ పురం, నగరి, బీఎన్ కండ్రిగ, వెదురుకుప్పం మండలాల క్రీడాకారులు ఉత్సాహంగా తలపడ్డారు. ఈ ముగింపు కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్ బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి ఇలాంటి టోర్నమెంట్లను ప్రతి నెలా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీయడానికి ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా ప్రముఖులు, నిర్వాహకులు నాగమల్లి మునికృష్ణ, వన్నేటి చంద్ర, గోపి, చెంచురత్నం, సుబ్బు, సాలాపక్షి నరేష్, జంగం గంగాధరం, పురుషోత్తం, సుధాకర్, రవి, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో ముగిసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్-19 బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ