శ్రీకాళహస్తి, మే 18, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బీసీ వర్గాల కోసం ప్రత్యేక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్‌ను రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ గుమ్మడిపూడి దశరథ చారి, మాసరపు సుబ్బయ్య కలిసి కోరారు. తిరుపతి శిల్పారామంలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్లో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గ జనాభాలో అధిక శాతం ఉన్న బీసీ వర్గాల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మిస్తే చిన్నకారు రైతులు, చేతివృత్తుల కుటుంబాలు, చేనేత కార్మికులు, హస్తకళాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. శిక్షణా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, సామాజిక సమావేశాలు, విద్యా కార్యక్రమాలు, వివాహాలు నిర్వహించేందుకు ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ప్రతిపాదనపై స్పందించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ బీసీ వర్గాల అభ్యున్నతికి కమ్యూనిటీ హాళ్లు అవసరమని పేర్కొంటూ, స్థలం కేటాయింపు, భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్వీ రమణ పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో బీసీ కమ్యూనిటీ హాల్ స్థలంకోసం మంత్రికి వినతి