శ్రీకాళహస్తి, జూన్ 08, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలోని ఏనుగులగుంట ప్రాంతంలో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యపై జనసేన పార్టీ నాయకులు మున్సిపల్ అధికారులతో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీ వాటర్ మోటార్ మరమ్మతులకు గురికావడంతో స్థానిక ప్రజలు, ముఖ్యంగా మహిళలు చుక్క నీటి కోసం రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు జనసేన నాయకుడు జయప్రకాష్ ఆధ్వర్యంలో పార్టీ బృందం ఏనుగులగుంట ప్రాంతంలో పర్యటించి స్థానికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మహిళలు పడుతున్న కష్టాలు తమను కలచివేసాయన్న జయప్రకాష్, వెంటనే మున్సిపల్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి మోటార్ కు తక్షణమే మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై జనసేన నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. ఈ పర్యటనలో జనసేన నాయకులు కుమార్, మహేష్, ఢిల్లీ, రఘు, చైతన్య, రాఘవ, చిరంజీవి, నారాయణ, లీలాధర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో తాగునీటి సమస్యపై జనసేన పోరాటం