Friday, 24 July 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం
- తిరుపతి

శ్రీకాళహస్తిలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం

శ్రీ కాళహస్తి, జులై 23, (పున్నమి న్యూస్): పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా శ్రీకాళహస్తిలో పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. జనసేన నాయకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమం గురువారం నాటికి విజయంవంతంగా 87వ వారానికి చేరుకుంది. నిరుపేదల ఆకలి తీర్చడమే ధ్యేయంగా సాగుతున్న ఈ అన్నదానానికి స్థానికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. సమాజంలో వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ 87వ వారపు అన్నదాన కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, మనీ, పసల సురేష్, ప్రదీప్ కుమార్, నవీన్, ముని చంద్ర, రాజా, చందు పాల్గొని స్వయంగా వడ్డనలు చేశారు. వీరితో పాటు వీర మహిళలు, శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత, పేట శారద, నారాయణ గాయత్రి, బత్తెమ్మ, ప్రసన్న, భారతి, వల్లి తదితరులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఈ అన్నదానాన్ని ఇలాగే ముమ్మరంగా కొనసాగిస్తామని జనసేన ప్రతినిధులు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.