శ్రీ కాళహస్తి, జులై 25, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఓటర్ల నమోదు అధికారి, ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి శనివారం ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 15 నుంచి జులై 24 వరకు బూత్ స్థాయి అధికారులు (BLO) ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుని ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించి డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఉన్న మొత్తం 2,49,123 మంది ఓటర్లలో 2,16,287 ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశామని చెప్పారు. క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా మొత్తం 32,836 మంది వివరాలను ఓటర్ల జాబితా నుండి తొలగింపు పరిశీలనకు (Deletion Category) గుర్తించినట్లు వెల్లడించారు. ఇందులో మరణించిన వారు 9,144 మంది, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు 14,281 మంది, రెండు చోట్ల ఓటు నమోదైన డూప్లికేట్ ఓటర్లు 3,357 మంది, ఇళ్లకు వెళ్లినప్పటికీ అందుబాటులో లేనివారు 6,015 మంది, ఇతర కారణాలు ఉన్నవారు 39 మంది ఉన్నారని వివరించారు. మండలాల వారీగా పరిశీలిస్తే శ్రీకాళహస్తి అర్బన్‌లో అత్యధికంగా 12,221 ఓట్లు, రేణిగుంటలో 9,083, శ్రీకాళహస్తి గ్రామీణంలో 4,363, ఏర్పేడులో 4,047, తోట్టంబేడులో 3,122 ఓట్లను తొలగింపు జాబితాలో గుర్తించినట్లు ఆర్డీవో తెలిపారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పూర్తయిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ- ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి