నందలూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయాన్ని గురువారం రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందజేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు నిత్యానంద రెడ్డి, కొండయ్య, గుండు మల్లికార్జున రెడ్డి, అజీజ్, నాని, నాగసుబ్బయ్య, ప్రభాకర్, కాకి చంద్ర, సుధాకర్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.




