Thursday, 10 September 2026
  • Home  
  • 528 కిలోల ఎర్రచందనం పట్టివేత
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

528 కిలోల ఎర్రచందనం పట్టివేత

చేజర్ల మండలం ఆదురుపల్లి అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు నిర్వహించగా, వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 20 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. వాటి మొత్తం బరువు 528 కిలోలు ఉన్నట్లు రాపూరు రేంజర్ అధికారులు తెలిపారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని, బొలెరో వాహనం విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అధికారులను గమనించి పరారైనట్లు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, అక్రమ ఎర్రచందనం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.