పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం జూలై 30
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ శాసనసభ్యురాలు బండారు శ్రావణి శ్రీ శక్తి పీఠాన్ని సందర్శించి ఆషాడం సారె సమర్పించారు.
ఈ సందర్భంగా పీఠం పరిపాలనాధికారి శ్రీకాంత్ ఆచార్య ఆధ్వర్యంలో పీఠంలోని దేవతామూర్తులకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆషాడ మాసం సందర్భంగా దేవతలకు సారె సమర్పించారు. అనంతరం వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం గావించారు.
తదనంతరం, కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి మరియు శ్రీ శ్రీ శ్రీ రమ్యానంద భారతీ మహాస్వామినీ వారిని దర్శించుకుని, వారి దివ్య ఆశీస్సులు అందుకున్నారు.
ఈ సందర్భంగా MLA బండారు శ్రావణి మాట్లాడుతూ — “శ్రీ శక్తి పీఠం అత్యంత శక్తివంతమైన, ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక క్షేత్రం” అని కొనియాడారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం, స్వామివార్ల ఆశీస్సులు పొందడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.





