పెదపూడి, జూలై 22 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని శ్రీ వారాహి దుర్గా ద్విశక్తి పీఠంలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, సమృద్ధి, అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పెదపూడి మండలం కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.


