అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి)
చేజర్ల మండలం ఆదురుపల్లిలోని శ్రీ త్రికోటేశ్వర విద్యాలయంలో
ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో దీపాలతో రంగవల్లికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థినీ విద్యార్థులు టపాకాయలు పేల్చి దీపావళి సంబరాలను ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. విద్యార్థినీ విద్యార్థులు స్వయంగా తయారుచేసిన మట్టి దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మీనరసారెడ్డి , డైరెక్టర్ సుధాకర్ రెడ్డి , ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులందరూ తగు జాగ్రత్తలు తీసుకొని పెద్దల సమక్షంలో దీపావళిని జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు బాల బాలికలు పాల్గొన్నారు.


