అలంపూర్ : సెప్టెంబర్ 10 ( పున్నమి ప్రతినిధి )
జోగులంబ గద్వాల జిల్లా, అలంపూర్, శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను దర్శించుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు.
ఆలయ ఈవో దీప్తి, ఆలయ అర్చకులు ఎమ్మెల్యేను పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి, శ్రీ జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే విజయుడికి శేష వస్త్రాలతో సన్మానించి, తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన శరన్నవరాత్రి కరపత్రాలను బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే విజయుడు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను కల్పించాలని ఆలయ ఈవో దీప్తికి సూచించారు.
ఈ కార్యక్రమంలో ఈవో దీప్తి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ జోగులాంబ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే విజయుడు.
అలంపూర్ : సెప్టెంబర్ 10 ( పున్నమి ప్రతినిధి ) జోగులంబ గద్వాల జిల్లా, అలంపూర్, శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను దర్శించుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ఆలయ ఈవో దీప్తి, ఆలయ అర్చకులు ఎమ్మెల్యేను పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి, శ్రీ జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే విజయుడికి శేష వస్త్రాలతో సన్మానించి, తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన శరన్నవరాత్రి కరపత్రాలను బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే విజయుడు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను కల్పించాలని ఆలయ ఈవో దీప్తికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవో దీప్తి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

