Tuesday, 14 July 2026
  • Home  
  • శివాలయం అభివృద్ధిపై పాలకుల నిర్లక్ష్యం..! ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని మేడిపల్లి నక్కర్త శివాలయం.. భక్తుల ఆవేదన
- E-పేపర్

శివాలయం అభివృద్ధిపై పాలకుల నిర్లక్ష్యం..! ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని మేడిపల్లి నక్కర్త శివాలయం.. భక్తుల ఆవేదన

శివాలయం అభివృద్ధిపై పాలకుల నిర్లక్ష్యం..! ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని మేడిపల్లి నక్కర్త శివాలయం.. భక్తుల ఆవేదన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : యాచారం మండలం, మేడిపల్లి నక్కర్త గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పురాతన శివాలయం గత కొన్ని సంవత్సరాలుగా పాలకులు, సంబంధిత అధికారుల నిర్లక్ష్యానికి గురవుతూ అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయింది. గ్రామ ప్రజలు, భక్తులు ఎన్నోసార్లు ఆలయ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆలయ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న ఈ శివాలయానికి ప్రతి సోమవారం, శివరాత్రి, కార్తీక మాసం వంటి పర్వదినాల్లో వందలాది మంది భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు. అయితే ఆలయానికి సరైన ప్రహరీ గోడ లేకపోవడం, ప్రాంగణం అభివృద్ధి చెందకపోవడం, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య సౌకర్యాలు లేకపోవడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ పరిసరాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురై అడవి మొక్కలు, చెత్తతో నిండిపోయాయని స్థానికులు చెబుతున్నారు. గ్రామ ప్రజల మాటల్లో చెప్పాలంటే, అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పే ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లోని పురాతన దేవాలయాలను మాత్రం పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. హిందూ దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, మేడిపల్లి నక్కర్త శివాలయానికి మాత్రం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఇటీవల గ్రామస్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శివలింగానికి పాలు, నీటితో అభిషేకం నిర్వహిస్తూ ఆలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ సహాయం లేకపోయినా, తమ శక్తి మేరకు ఆలయాన్ని కాపాడేందుకు గ్రామ యువకులు, భక్తులు కృషి చేస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ శాశ్వత అభివృద్ధి కోసం ప్రభుత్వ సహకారం తప్పనిసరి అని అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ఆలయానికి ప్రహరీ గోడ నిర్మాణం, ప్రాంగణ అభివృద్ధి, సీసీ రోడ్డు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ దీపాలు, ఉద్యానవనం, భక్తులకు కూర్చునే షెడ్లు వంటి మౌలిక వసతులు వెంటనే కల్పించాలని ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేను, దేవాదాయ శాఖ అధికారులను కోరారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ పురాతన శివాలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేసి భక్తుల మనోభావాలను గౌరవించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

శివాలయం అభివృద్ధిపై పాలకుల నిర్లక్ష్యం..!

ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని మేడిపల్లి నక్కర్త శివాలయం.. భక్తుల ఆవేదన

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
యాచారం మండలం, మేడిపల్లి నక్కర్త గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పురాతన శివాలయం గత కొన్ని సంవత్సరాలుగా పాలకులు, సంబంధిత అధికారుల నిర్లక్ష్యానికి గురవుతూ అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయింది. గ్రామ ప్రజలు, భక్తులు ఎన్నోసార్లు ఆలయ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆలయ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న ఈ శివాలయానికి ప్రతి సోమవారం, శివరాత్రి, కార్తీక మాసం వంటి పర్వదినాల్లో వందలాది మంది భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు. అయితే ఆలయానికి సరైన ప్రహరీ గోడ లేకపోవడం, ప్రాంగణం అభివృద్ధి చెందకపోవడం, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య సౌకర్యాలు లేకపోవడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ పరిసరాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురై అడవి మొక్కలు, చెత్తతో నిండిపోయాయని స్థానికులు చెబుతున్నారు.
గ్రామ ప్రజల మాటల్లో చెప్పాలంటే, అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పే ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లోని పురాతన దేవాలయాలను మాత్రం పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. హిందూ దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, మేడిపల్లి నక్కర్త శివాలయానికి మాత్రం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదని గ్రామస్థులు వాపోతున్నారు.
ఇటీవల గ్రామస్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శివలింగానికి పాలు, నీటితో అభిషేకం నిర్వహిస్తూ ఆలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ సహాయం లేకపోయినా, తమ శక్తి మేరకు ఆలయాన్ని కాపాడేందుకు గ్రామ యువకులు, భక్తులు కృషి చేస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ శాశ్వత అభివృద్ధి కోసం ప్రభుత్వ సహకారం తప్పనిసరి అని అభిప్రాయపడుతున్నారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ఆలయానికి ప్రహరీ గోడ నిర్మాణం, ప్రాంగణ అభివృద్ధి, సీసీ రోడ్డు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ దీపాలు, ఉద్యానవనం, భక్తులకు కూర్చునే షెడ్లు వంటి మౌలిక వసతులు వెంటనే కల్పించాలని ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేను, దేవాదాయ శాఖ అధికారులను కోరారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ పురాతన శివాలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేసి భక్తుల మనోభావాలను గౌరవించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.